మీ ఫోన్ హ్యాక్ అయిందేమో అని అనుమానంగా వుందా..? అయితే ఇలా తెలుసుకోండి..!

-

ఈ మధ్య కాలంలో చాలా మంది ఫోన్స్ ని హ్యాక్ చేస్తున్నారు. ఆ తరవాత ఆ ఫోన్స్ లో ఉన్న విలువైన సమాచారాన్ని దోచుకుంటున్నారు. అయితే ఒక్కోసారి మనకి కూడా అనుమానం కలుగుతూ ఉంటుంది. మన ఫోన్ కూడా ఎవరైనా హ్యాక్ చేశారా లేదా అనేది అర్థం కాదు.

అయితే మీకు కూడా మీ ఫోన్ ఎవరైనా హ్యాక్ చేశారా అన్న అనుమానం ఉందా..? అయితే ఇలా తెలుసుకోండి. నిజానికి ఐఫోన్ కంటే ఆండ్రాయిడ్ ఫోన్స్ చాలా సేఫ్. ఒకవేళ కనుక మీ ఫోన్ హ్యాక్ చేయబడింది అంటే మీ ఫోన్ లో ఈ మార్పులు వస్తాయి. ఇక మరి వాటి కోసం చూద్దాం.

చార్జింగ్ వెంటనే తగ్గిపోతూ ఉంటుంది:

మీరు కొంచెం సేపు మీ ఫోన్ ని ఉపయోగించినా చార్జింగ్ తగ్గిపోతుంది అంటే మీ ఫోన్ హ్యాక్ అయిందని మీరు అనుమానించాలి. ఇలా జరిగినప్పుడు కొత్త యాప్స్ ని ఇన్స్టాల్ చేయకండి. అలాగే కాస్త అనుమానాస్పదంగా ఉండే వెబ్సైట్ల మీద కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటివి చేయడం వల్ల మీ వ్యక్తిగత సమాచారం థర్డ్ పార్టీ చేతుల్లోకి వెళుతుంది.

డేటా వేగంగా అయిపోతుంది:

మీ ఫోన్ డాటా వాడిన వాడకపోయినా వేగంగా అయిపోతుంది అంటే కూడా హ్యాక్ చేశారేమో అని మీరు అనుమానించవచ్చు. ఎందుకంటే ఫోన్ కి సంబంధించిన యూజర్ వ్యక్తిగత సమాచారం ని పదే పదే సేకరిస్తూ వుంటారు. దీని వల్ల డేటా తగ్గిపోతుంది.

ఫోన్ క్రాష్:

అంతేకాకుండా మీ ఫోన్ ఓపెన్ చేసినప్పుడు ఫోన్ సడన్ గా క్రాష్ అయింది అంటే మీ ఫోన్ పై దాడి చేసిందని కానీ ఫోన్ హ్యాక్ అయిందని కానీ మీరు గ్రహించాలి. ఇలా ఈ విధంగా మీరు ఈజీగా ఫోన్ హ్యాక్ అయిందా లేదా అనేది తెలుసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version