ఈడీ కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోర్ట్ కి హాజరు కావాల్సిందే సిబిఐ కోర్ట్ షాక్ ఇచ్చింది. తనకు బదులుగా జగతి పబ్లికేషన్స్ ప్రతినిధి హాజరయ్యేందుకు అవకాశమివ్వాలని జగన్ తరుపు న్యాయవాది పిటీషన్ దాఖలు చేయగా ఆ పిటీషన్ ని కోర్ట్ కొట్టేసింది. ఈడీ కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపు biకుదరదని కోర్ట్ స్పష్టం చేసింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడానికి కోర్ట్ అంగీకరించలేదు.
ఇప్పటికే సిబిఐ కేసుల నుంచి తనకు వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తరుపు న్యాయవాది కోర్ట్ ని కోరగా కోర్ట్ అందుకు నిరాకరించింది. సిబిఐ కూడా ఈ విషయంలో పట్టుదలగా వ్యవహరించి జగన్ కోర్ట్ కి రావాల్సిందే అని పిటీషన్ కూడా దాఖలు చేసింది. ఈ నేపధ్యంలో కనీసం ఈడీ కేసుల నుంచి అయినా సరే మినహాయింపు ఇవ్వాలని కోరారు.
దాని నుంచి కూడా కోర్ట్ మినహాయింపు ఇవ్వడానికి నిరాకరించింది. ఇదిలా ఉంటే శుక్రవారం ఆయన కోర్ట్ కి హాజరు కాలేదు. ముఖ్యమంత్రిగా పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్న నేపధ్యంలో తనకు మినహాయింపు ఇవ్వాలని కోర్ట్ ని కోరడంతో అందుకు కోర్ట్ అంగీకరించింది. శుక్రవారం విచారణకు విజయసాయి రెడ్డి, శ్రీలక్ష్మి, సహా పలువురు ఐఏఎస్ అధికారులు కోర్ట్ విచారణకు హాజరయ్యారు.