లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కి సమన్లు జారీ చేసిన కోర్టు

-

మద్యం కుంభకోణం కేసులో మంగళవారం సీఎం కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఏడవ అనుబంధ ఛార్జ్‌సీట్‌ను దాఖలు చేసింది. సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ను ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకుంది.తాజా ఛార్జ్ షీట్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ,కేజ్రీవాల్ లపై ఈడీ అభియోగాలు మోపింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకుని.. జూలై 12వ తేదీన హాజరుకావాలని సమన్లు జారీ చేసింది.

మరోవైపు తనను సీబీఐ అరెస్ట్‌ చేయటం, మూడు రోజుల కస్టడీకి తీసుకోవటంపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్.దీంతో పాటు ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇక ఈ 2 పిటిషన్లపై జూలై 17న విచారణ జరగనుంది.లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.అనంతరం ఈడీ కస్టడీ తర్వాత తీహార్ జైలుకు తరలించారు. ఇక ఎన్నికల సమయంలో ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ మంజూరు కాగా అనంతరం జూన్ 2న తిరిగి తీహార్ జైల్లో లొంగిపోయారు. ఇక ఇటీవల ట్రయిల్ కోర్టు కేజ్రీవాల్‌ కు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. కాని ఈడీ హైకోర్టుకు వెళ్లి అడ్డుకోవడంతో ఆప్ తీవ్ర నిరాశకు గురైంది.

Read more RELATED
Recommended to you

Latest news