మహారాష్ట్ర, బెంగాల్లో కరోనా కల్లోలం… ఈ రాష్ట్రాల్లో భారీగా పెరిగిన కేసులు

-

covidదేశంలో మరోసారి కోవిడ్ అలజడి రేపబోతుందా.. అంటే కేసులు చూస్తే మాత్రం అలాగే అనిపిస్తోంది. ఇండియాలో థర్డ్ వేవ్ తప్పదా..అని అనుమానాలు కలుగుతున్నాయి. ఓవైపు పెరుగుతున్న ఓమిక్రాన్ కేసులతో సతమతం అవుతుంటే… ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య కూడా తీవ్రంగా పెరుగుతోంది. పది రోజుల క్రితం రోజూవారీ కేసుల సంఖ్య 10 వేల లోపు ఉంటే ప్రస్తుతం రోజూవారీ కేసుల సంఖ్య లక్షను దాటింది.

మరోవైపు మహారాష్ట్ర, బెంగాల్ రాష్ట్రాలు కరోనాతో అతలాకుతలం అవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో దేశంలో ఎక్కడా లేని విధంగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 41,434 కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 13 మంది మరణించారు. ఒక్క ముంబైలోనే 20 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్లో కూడా కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో అక్కడ  18,802 కొత్త కరోనా కేసులు నమోదవ్వగా… 19 మంది మరణించారు. కర్ణాటకలో 24 గంటల వ్యవధిలో 8906 కేసులు నమోదవ్వగా… నలుగురు మరణించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version