షాకింగ్ న్యూస్‌: అప్పుల్లో భార‌త్ విల‌విల‌.. చరిత్ర‌లోనే మొద‌టిసారి

-

క‌రోనా మ‌హ‌మ్మారికి కార‌ణంగా అన్ని రంగాలు దెబ్బ‌తిన్నాయి. ప్ర‌ధానంగా ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు అత‌లాకుత‌లం అయ్యాయి. చిన్న‌దేశం.. పెద్ద‌దేశం అన్న తేడా లేకుండా.. అన్ని దేశాలూ విల‌విలాడుతున్నాయి. కోలుకోలేని స్థితికి చేరుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో భార‌త‌దేశం కూడా అప్పుల్లో కూరుకుపోతోంది. గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా, గ‌తంలో ఎన్నడూ చూడ‌ని విధంగా భార‌త అప్పుల‌కుప్ప అమాంతంగా పెరిగిపోతోంది. క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌తో పోటీప‌డుతూ దేశం అప్పు రాకెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. దేశ చ‌రిత్ర‌లోనే మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం అప్పులు జూన్ చివరినాటికి 100 ట్రిలియన్ డాలర్లను దాటాయంటే ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చున‌ని ప‌లువురు విశ్లేష‌కులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల విభాగం (డిఇఎ) త్రైమాసిక నివేదిక ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది.

money

ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్ 2020) ఆకస్మికంగా రూ .7 ట్రిలియన్ల అప్పు పెరిగింది. దీంతో భార‌త అప్పుడు రూ .100 ట్రిలియన్ మార్కును మించిపోయింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి డేటాబేస్ (డిసెంబర్ 2019) ప్రకారం ప్రస్తుతం ఇది జీడీపీలో 43 శాతంగా ఉంది. సాపేక్ష రుణాల పరంగా భారతదేశం ప్రస్తుతం 170 దేశాలలో 94 వ స్థానంలో ఉంది. అయితే.. ఇలా అధిక రుణాలు తీసుకుంటూ పోతే.. పైపైకి ఎగ‌బాక‌డం ఖాయ‌మ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. కొద్దికాలంలోనే భార‌త రుణం స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) లో 60 శాతం స్థాయిని దాటుతుంద‌ని విశ్లేషకులు అంచ‌నావేస్తున్నారు. అయితే.. మార్చి 2023 నాటికి ప్రభుత్వ రుణం జీడీపీలో 40 శాతం కంటే తక్కువగా ఉండాలని 2017 ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ నియమాలు సిఫారసు చేశాయి. కానీ.. వీట‌న్నింటినీ దాటుకుని భార‌త అప్పు పైపైకి ఎగ‌బాకుతోంది. దీనిని మోడీ ప్ర‌భుత్వం ఎలా అధిగ‌మిస్తుందో చూడాలి మ‌రి.

Read more RELATED
Recommended to you

Exit mobile version