కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్ సోకిన వారికి దగ్గు, తీవ్రమైన జ్వరం, రుచి, వాసన తెలియకపోవడం వంటి కామన్ లక్షణాలు కనిపిస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే కోవిడ్ ఇన్‌ఫెక్షన్ ఉన్నవారి చర్మంపై పలు విధాలైన మార్పులు వస్తాయని కూడా సైంటిస్టులు తేల్చారు. పలువురు కోవిడ్ బాధితులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం సైంటిస్టులు ఈ వివరాలను వెల్లడించారు.
కోవిడ్ ఇన్‌ఫెక్షన్ వచ్చిన వారిలో చేతి వేళ్లు, కాలి వేళ్లపై చర్మం కొన్ని చోట్ల కందిపోయినట్లు ఎర్రగా, నల్లగా మారుతుంది. కొందరికి బొబ్బలు కూడా వస్తాయి. 8 దేశాల్లో 318 మంది రోగులకు ఇదే విధంగా చర్మం మారిందని సైంటిస్టులు గుర్తించారు.
Pernio-like skin lesions associated with COVID-19: A case series of 318 patients from 8 countries https://t.co/yV6g5WUrQ2 pic.twitter.com/rnrxc4BLMz
— JAAD Journals (@JAADjournals) August 12, 2020
కోవిడ్ సోకిన వారిలో కొందరికి కాళ్లపై వేడి బొబ్బల మాదిరిగా కనిపిస్తాయి.
I have woken to find a random blister on my lower leg. Unless I burnt my leg on my hot water bottle last night (doubt it) I've no idea why this has formed.
Covid-19 makes one paranoid about any potential deterioration in health. pic.twitter.com/PX9kQIXY3q— Robert J.E. Simpson (@avalard) March 24, 2020
కరోనా సోకిన కొందరిలో కాలి వేళ్లు, మడమలపై చర్మం కందిపోయి ఎర్రగా మారుతుంది. అక్కడంతా దద్దుర్లు వస్తాయి. ఈ విధమైన లక్షణాలను కూడా కొందరు కోవిడ్ పేషెంట్లలో గమనించారు.
(1/12) The #CovidToes mystery deepens again.
It looks like they are caused by #SARSCoV2 after all, but people have been looking with the wrong test.
It seems pretty conclusive now that #COVID19 cases in children are being missed.
A short thread… pic.twitter.com/ToZvpxJ1AU
— Dr Zoë Hyde (@DrZoeHyde) August 15, 2020
ఇక కరోనా సోకిన కొందరిలో చర్మం కందిపోదు. కానీ దద్దుర్లు మాత్రం ఏర్పడుతాయి.
Urticaria, sabañones… El Covid-19 también ataca a la piel https://t.co/UhFCe1UfxH pic.twitter.com/UgC5nL8PHa
— Esteban Garrido (@ElGarresteban) April 10, 2020
ప్రపంచవ్యాప్తంగా పలు ప్రముఖ హాస్పిటల్స్, రీసెర్చి ఇనిస్టిట్యూట్‌లకు చెందిన సైంటిస్టులు ఈ లక్షణాలను పలువురు కోవిడ్ పేషెంట్లలో గుర్తించారు. కనుక ఎవరికైనా సరే పైన తెలిపిన లక్షణాలు కనిపిస్తే ఏ మాత్రం ఆలస్యం చేయరాదని సైంటిస్టులు హెచ్చరించారు. వీలైనంత త్వరగా చర్మ వ్యాధుల నిపుణులను కలవాలని, వైద్య పరీక్షలు.. ముఖ్యంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. లేదంటే సమస్య తీవ్రతరం అయ్యి ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడుతాయని తెలిపారు.