అన్నదానం ఎందుకు ముఖ్యం?

-

మనం ఎన్నో దానాల గురించి వింటుంటాం. అందులో అన్నదానం ఎంతో విశిష్టిత కలిగింది. వాటిలో ముఖ్యంగా రక్తదానం, అవయవదానం, అన్నదానం గురించి ఎక్కువగా వింటుంటాం. అన్ని దానాల కంటే అన్నదానం ఎంతో గొప్పదని చెబుతారు. హిందూ సంప్రదాయం ప్రకారం భోజనం పెట్టి ఒకరి కడుపు నింపవచ్చు. దీనికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. అన్నదానం అన్ని దానాల కంటే ప్రధానమైందని పండితులు చెబుతారు.

అన్నదానం వల్ల ఫలితాలు

అన్నదానం వల్ల కలిగే లాభాలను మనం తెలుసుకుందాం. మనం ఎన్ని దానాలు చేసినా ఎవ్వరికీ ఎన్ని ఇచ్చినా ఇంకా కావాలనిపిస్తుంది. కావాలని ఒక్క అన్నదానంలో మాత్రమే దానం తీసుకున్నవారు ఇంక చాలు అని సంతృప్తి చెందుతారు. మిగిలిన ఏ దానం సంతృప్తిపరచక పోవచ్చు. కానీ, ఒక్క అన్నదానం మాత్రమే సంతృప్తిపరుస్తుంది. ఆహారం లేనిదే ఈ భూమిపై ఏ ప్రాణి జీవించలేదు. మూడు పూటలా ఏ లోటు లేకుండా అన్నం దొరకడం అంటే సాక్షాత్తు కాశీ అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహం తప్పనిసరి కావాలి.
భోజనం సమయంలో ఆ అమ్మను తలచుకొని మనస్ఫూర్తిగా ద్యానం చేసుకుని ఈ లోకంలో మనతో కలిసి జీవించే ప్రతి జీవికి ఏదో ఒక ఆహారాన్ని సమర్పించి, భోజనం చేసే వారికి అతిథి, ఆపన్నులకు, ఆకలితో బాధపడేవారికి అన్న ప్రసాదాన్ని అందించే వారికి ఆ తల్లి అనుగ్రహం తప్పక లభిస్తుందని పండితులు చెబుతుంటారు.

అన్నదానం కోటి గోవుల దాన ఫలితంతో సమానమైందని పండితులు చెబుతుంటారు. ఇదే విషయాన్ని మన పెద్దలు కూడా భావించి చేసేవారు కూడా. కర్నూలు జిల్లాలో ఓ శైవక్షేత్రంలో నిత్యాన్నదానం జరుగుతుంది. త్రేతా యూగం ద్వాపర యూగంలో యజ్ఞయాగాలతో తపస్సులు మోక్షం పొందారు. అదే విధంగా కళియుగంలో దానధర్మాలు, దైవారాధన, నామస్మరణ మొదలైన వాటి ద్వారా సులభతరమైన మోక్షమార్గాన్ని దైవం ప్రసాదించారని పండితులు చెబుతారు. అన్నదానం ఎలాంటి స్వార్థం లేకుండా జలదానం, గోదానం వస్త్రదానం, కన్యాదానం విశిష్టమైంది.

పురాణాల ప్రకారం

పురాణాల ప్రకారం కర్ణుడు బలిచక్రవర్తి వద్దకు భగవంతుడే యాచకుడిగా వచ్చి దానం స్వీకరించి వారికి మోక్షాన్ని ప్రసాదించినట్టు ఇతిహాసాల ద్వారా మనకు తెలుస్తుంది. ఎవరికైతే దాన గుణం ఉందదో, వారికి మోక్షం లభించదు. ఎలాంటి స్వార్థం లేకుండా సహాయం చేసే దానం చాలా అత్యున్నతమైంది. ఆకలితో ఉన్నవారికి పేదలకు, అనాథ రోగులకు, వికలాంగులకు అన్నదానం చేయడంలో ఏ మాత్రం పక్షపాతం వహించకూడదు. పరమత బేధం అస్సలు ఉండకూడదు. కాబట్టి వీలైనంత మేరకు ఆకలితో బాధపడేవారికి ఎంతో కొంత సహాయం చేద్దాం. అన్నం పరబ్రహ్మ స్వరూపంగా గౌరవిద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version