కోవిడ్‌ 19 టాప్‌ 10 అప్‌డేట్స్ (06-09-2020)

-

కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో ఆది‌‌‌వారం (06-09-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..

1. క‌రోనా సోకిన ప‌లువురు రోగుల‌కు డెంగ్యూ, మ‌లేరియా వంటి వ్యాధులు ఉన్న‌ట్లు కూడా ఢిల్లీకి చెందిన వైద్యులు గుర్తించారు. ప్ర‌తి ఏటా వ‌ర్షాకాలంలో ఈ వ్యాధులు వ‌స్తాయి. కానీ క‌రోనా ఉన్న‌ప్ప‌టికీ ఈ వ్యాధులు విజృంభిస్తుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

2. ఏపీలో ఒకే రోజు ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌కు క‌రోనా సోకింది. అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యే డాక్టర్‌ తిప్పేస్వామి, కృష్ణా జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావులకు కరోనా సోకింది.

3. బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ కి కరోనా సోకింది. ఈ విషయాన్ని అత‌ను స్వయంగా వెల్ల‌డించాడు. కరోనా పాజిటివ్ రావ‌డంతో తాను హోమ్ ఐసోలేషన్ లోనే ఉంటున్నానని తెలిపాడు.

4. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 90,633 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 41,13,812 కు చేరుకుంది. 8,62,320 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 31,80,866 మంది కోలుకున్నారు. 70,626 మంది ప్రాణాలు కోల్పోయారు.

5. తెలంగాణ‌లో కొత్త‌గా 2,574 క‌రోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,40,969 కు చేరుకుంది. 886 మంది చ‌నిపోయారు. 1,07,530 మంది కోలుకున్నారు. 32,553 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

6. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కొత్త‌గా 1694 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 73,574కు చేరుకుంది. 16,115 మంది చికిత్స పొందుతున్నారు. 55,887 మంది కోలుకున్నారు. 1572 మంది చ‌నిపోయారు.

7. మ‌హారాష్ట్ర‌లో కొత్త‌గా 23,350 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 9,07,212కు చేరుకుంది. 6,44,400 మంది కోలుకున్నారు. 2,35,857 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 26,604 మంది ప్రాణాలు కోల్పోయారు.

8. ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధిక క‌రోనా కేసులు న‌మోదైన దేశాల్లో భార‌త్ రెండో స్థానానికి చేరుకుంది. 41,13,811 కేసుల‌తో భార‌త్ త‌న ముందున్న బ్రెజిల్‌ను దాటింది. మొద‌టి స్థానంలో 64,34,626 క‌రోనా కేసుల‌తో అమెరికా కొన‌సాగుతోంది.

9. క‌ర్ణాట‌క‌లో కొత్త‌గా 9,319 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య‌ 3,92,139 కు చేరుకుంది. 2,92,873 మంది కోలుకోగా, 99,266 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 6,393 మంది చ‌నిపోయారు.

10. దేశంలో క‌రోనా మ‌ర‌ణాల రేటు 1.72 శాతానికి త‌గ్గింద‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. రిక‌వ‌రీ రేటు 77.32 శాతానికి చేరుకుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ల్ప క‌రోనా మ‌ర‌ణాలు ఉన్న దేశాల్లో భార‌త్ కూడా ఒక‌టిగా నిలిచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version