కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో మంగళవారం (08-09-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..
1. రష్యా దేశం తమ స్పుత్‌నిక్-వి కరోనా వ్యాక్సిన్‌ను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసి తమకు అందివ్వాలని భారత్‌ను సహాయం కోరింది. కరోనా వ్యాక్సిన్ డోసుల కోసం భారత్‌పై రష్యా ఆధార పడుతోంది. భారత్‌లోని ఫార్మా కంపెనీల్లో తమ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసి అందించాలని రష్యా కోరింది.
2. ఏపీలో కొత్తగా 10,601 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 5,17,094కు చేరుకుంది. 96,769 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 4,15,765 మంది కోలుకున్నారు. 4,560 మంది చనిపోయారు.
3. తెలంగాణ అసెంబ్లీలో ఒక పక్క సమావేశాలు జరుగుతున్న సమయంలోనే కరోనా కలకలం రేగింది. అసెంబ్లీలో పాసులు ఇష్యూ చేసే ఉద్యోగికి కరోనా సోకినట్లు అధికారులు పేర్కొన్నారు.
4. రష్యా రూపొందించిన స్పుత్‌నిక్-వి కరోనా వ్యాక్సిన్‌ను ఎట్టకేలకు ఆ దేశం ప్రజా పంపిణీ కోసం విడుదల చేసింది. ఆగస్టు 11న ఆ వ్యాక్సిన్‌ను రిజిస్టర్ చేశారు. తాజాగా ఈ వ్యాక్సిన్ మొదటి బ్యాచ్‌ను పంపిణీకి సిద్ధం చేశారు.
5. కరోనా నేపథ్యంలో దేశంలో తీవ్రమైన మానసిక సమస్యలతో సతమతమవుతున్న వారికి సహాయం చేయడం కోసం కేంద్రం కొత్తగా 1800-599-0019 పేరిట ఓ నూతన టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
6. దేశంలో కొత్తగా 75,809 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 42,80,423కు చేరుకుంది. 8,83,697 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 33,23,951 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 72,775 మంది ప్రాణాలు కోల్పోయారు.
7. తెలంగాణలో కొత్తగా 2,392 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,45,163కు చేరుకుంది. మొత్తం 906 మంది చనిపోయారు. 1,12,587 మంది కోలుకున్నారు. 31,670 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
8. కరోనా నేపథ్యంలో 10 వేల పడకలతో ఏర్పాటు చేసిన దేశంలోని అతిపెద్ద కోవిడ్ కేంద్రాన్ని ఈ నెల 15వ తేదీ నుంచి మూసివేయనున్నారు. అందులో ఉన్న రోగుల సంఖ్య బాగా తగ్గడంతో ఆ కేంద్రాన్ని మూసివేస్తున్నారు.
9. పశ్చిమబెంగాల్‌లో కొత్తగా 3,091 కరోనా కేసుల నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,86,956కు చేరుకుంది. 1,60,025 మంది కోలుకున్నారు. 23,254 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 3,677 మంది చనిపోయారు.
10. మహారాష్ట్రలో కొత్తగా 16,429 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 9,23,641కి చేరుకుంది. 6,59,322 మంది కోలుకున్నారు. 2,36,934 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 27,027 మంది చనిపోయారు.