కోవిడ్‌ 19 టాప్‌ 10 అప్‌డేట్స్ (09-09-2020)

-

కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో బుధ‌‌వారం (09-09-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..

1. మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా వెల్ల‌డించారు. త‌న‌ను క‌లిసిన వారు క‌రోనా టెస్టులు చేయించుకోవాల‌ని ఆయ‌న కోరారు. వైద్యుల సూచ‌న‌ల‌తో ఆయ‌న ప్ర‌స్తుతం ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు.

2. ఏపీలో కొత్త‌గా 10,418 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 5,27,512కు చేరుకుంది. 97,271 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 4,25,607 మంది కోలుకున్నారు. 4,634 మంది చ‌నిపోయారు.

3. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాల్య స్నేహితుడు, కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మ‌న్ బొమ్మెర వెంకటేశం కరోనాతో కన్నుమూశారు. గత కొంతకాలంగా కరోనాతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని వాసవి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చ‌నిపోయారు.

4. ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్ర‌భుత్వంపై మ‌రోసారి విరుచుకు ప‌డ్డారు. దేశంలో క‌రోనాను నియంత్రించ‌డం కోసం దాదాపుగా 3 నెల‌ల పాటు సుదీర్ఘ‌మైన లాక్ డౌన్ ను విధించార‌ని, పేద‌ల‌పై కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్‌తో దాడి చేసింద‌ని ఆరోపించారు.

5. కరోనా ఎమ‌ర్జెన్సీ పేషెంట్ల‌కు అందిస్తున్న ప్లాస్మా థెరపీ కోవిడ్ మ‌ర‌ణాల‌ను త‌గ్గించ‌లేక‌పోతున్న‌ద‌ని ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్‌) తెలియ‌జేసింది. ప్లాస్మా థెర‌పీ వ‌ల్ల కోవిడ్ మ‌ర‌ణాల సంఖ్య త‌గ్గ‌డం లేద‌ని, అలాగే ఉంద‌ని తెలిపింది.

6. ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ త‌న క‌రోనా వ్యాక్సిన్‌కు బ్రిట‌న్‌లో మూడో ద‌శ ట్ర‌య‌ల్స్‌ను నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే వ్యాక్సిన్ తీసుకున్న ఓ వాలంటీర్‌కు తీవ్ర‌మైన అనారోగ్య స‌మ‌స్య‌లు రావ‌డంతో ట్ర‌య‌ల్స్‌ను నిలిపివేశారు.

7. దేశంలో కొత్త‌గా 89,706 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 43,70,128కి చేరుకుంది. 73,890 మంది చ‌నిపోయారు. 33,98,844 మంది కోలుకున్నారు. 8,97,394 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

8. ప్ర‌పంచ వ్యాప్తంగా కొత్త‌గా 2,37,628 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,77,18,681కి చేరుకుంది. 9,00,791 మంది చ‌నిపోయారు. 1.98 కోట్ల మంది కోలుకున్నారు. 70.30 లక్ష‌ల యాక్టివ్ కేసులు ఉన్నాయి.

9. తెలంగాణ‌లో కొత్త‌గా 2,479 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,47,642కు చేరుకుంది. 916 మంది చ‌నిపోయారు. 1,15,072 మంది కోలుకున్నారు. 31,654 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

10. క‌ర్ణాట‌క‌లో కొత్త‌గా 9,540 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 4,21,730కి చేరుకుంది. 3,15,433 మంది కోలుకున్నారు. 99,470 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 6,860 మంది చ‌నిపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version