కరోనా వ్యాక్సిన్‌కు గాను మన దేశంలో భారత్ బయోటెక్, కాడిలా హెల్త్‌కేర్ కంపెనీలు ఇప్పటికే ఫేజ్ 1, 2 క్లినికల్ ట్రయల్స్‌ను చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇంతలోపే ప్రజలకు రష్యా దేశం గుడ్ న్యూస్ చెప్పింది. తాము తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌కు క్లినికల్ ట్రయల్స్ దాదాపుగా పూర్తయినట్లేనని తెలిపింది. రష్యాలోని గమలీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ వారు కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌ను జూన్ 18న ప్రారంభించారు. అందుకు గాను చివరి దశ ట్రయల్స్ ప్రస్తుతం దాదాపుగా పూర్తయ్యాయి.
క్లినికల్ ట్రయల్స్‌లో వ్యాక్సిన్ తీసుకున్న వారు కరోనా నుంచి తట్టుకున్నారని సైంటిస్టులు తెలిపారు. వారికి ఆ వైరస్ నుంచి రక్షణ లభించిందని, వారిలో యాంటీ బాడీలు తయారయ్యాయని తెలిపారు. రెండు గ్రూపుల్లో వాలంటీర్లకు వ్యాక్సిన్‌ను ఇవ్వగా సత్ఫలితాలు వచ్చాయి. అయితే చివరి దశ ఎప్పటికి పూర్తవుతుంది, వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది.. అన్న వివరాలపై వారు స్పష్టతనివ్వలేదు.
ఇక భారత్‌లో భారత్ బయోటెక్, కాడిలా హెల్త్‌కేర్‌లు ఫేజ్ 1, 2 క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించాయి. అవి పూర్తయ్యేందుకు నెల రోజులు పట్టే అవకాశం ఉంది. దీంతో ఆ ట్రయల్స్‌లో సత్ఫలితాలు వస్తే నేరుగా వ్యాక్సిన్‌లను పంపిణీ చేయాలని ఇప్పటికే ఐసీఎంఆర్ ఆయా సంస్థలకు సూచించింది. మరి వ్యాక్సిన్ ట్రయల్స్‌లో సత్ఫలితాలు వస్తాయో, రావో చూడాలి.