తెలంగాణలోని వరంగల్ లో “ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” పై మీడియా సమావేశం నిర్వహించారు ఎపీ అరవింద్. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొన్ని హిందూ వ్యతిరేక శక్తులు తనపై దాడి చేశాయని ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. అలాగే.. అక్కడితో ఆగకుండా హైవేపై వాహనాల్లోని తన వాహనాన్ని వెంబడించారని తరిమితరిమి కొట్టాలని చూశారని కూడా ఆయన తెలిపారు. ఒక ప్రజా ప్రతినిధిపై పట్టపగలు దాడి జరగడం ముఖ్యమంత్రి, హోమ్ మంత్రి, డీజీపీలు సిగ్గుపడాల్సిన విషయంగా అరవింద్ తెలిపారు. అలాగే.. కేసీఆర్ ఆదేశాలతో జరుగుతున్న దాడులకు దాడులే సమాధానం అయితే టీఆర్ఎస్ నాయకుల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోండని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు.
అయితే ఈ దాడికి ఆయనవాడిన భాష కారణంగా తెలుస్తోంది. వరంగల్ అర్బన్ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన అరవింద్.. కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. “కేసీఆర్ పనికిమాలిన ముఖ్యమంత్రి”… అంటూ మొదలుపెట్టి… “ప్రజలు కష్టాల్లో ఉంటే సీఎం.. ఫామ్ హౌస్‌లో ఉంటారా..?” అంటూ సర్కార్ విధానాలను తూర్పారబట్టారు. కేసీఆర్, కేటీఆర్, వారి చెంచాలు కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వల్లే కేంద్ర సహాయాన్ని కూడా అందుకోలేకపోతున్నామని అరవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైసీని జిన్నాతో పోలుస్తావా? కేసీఆర్ అంటూ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని హిందూ వ్యతిరేకుల చేతిలో పెడుతున్న కేసీఆర్… ఒక “దగుల్ బాజీ హిందు” అని… ఓవైసీ, కేసీఆర్ పెద్దకొడుకు అంటూ కూడా అరవింద్ సంచలనాత్మక విమర్శనాస్త్రాలు సంధించిన సంగతి తెలిసిందే!
అయితే అరవింద్ అలా ప్రెస్ మీట్ అయిపోయిందో లేద కొందరు టీఆర్ఎస్ నేతలు నేతలు దాడికి పాల్పడ్డారు. ధర్మపురి అరవింద్ వాహనాన్ని వరంగల్ లో తరింతరిం కొట్టారు. ఓ రకమైన భయంతో వణుకు పుట్టించారు. కాగా ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందిస్తూ… బీజేపీ నాయకులపై దాడులు కొత్త కాదని.. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి బండారం భూకబ్జాలపై బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా నిలదీయడం మా బాధ్యతని వివరించారు. కెసిఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రమౌతుందని… ఆ భయాందోళనతో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై టీఆర్ఎస్ దాడులకు పాల్పడుతోందని వివరించారు. టీఆర్ఎస్ పార్టీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని.. తెలంగాణ రజాకార్ల రాజ్యం అయ్యిందని బండి సంజయ్ వివరించారు. అలాగే… టీఆర్ఎస్ నాయకులు, పోలీసులు కలిసి చేసిన దాడి అని.. కేసీఆర్ నిరంకుశత్వానికి ఈ దాడి నిదర్శనమని బండి సంజయ్ వివరించారు.