కోవిడ్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. దేశాలకు దేశాలు కోవిడ్ దెబ్బతో విలవిల్లాడుతున్నాయి. లక్షల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. వైరస్ తన రూపును మార్చుకుని కొత్తకొత్త వేరియంట్ల రూపంలో ప్రజలపై అటాక్ చేస్తోంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ప్రజలు మహమ్మారి బారిన పడుతున్నారు. అయితే తాజా అధ్యయనాల ప్రకారం పిల్లల్లో మానసిక పరిస్థితిపై కోవిడ్ తీవ్ర ప్రభావం చూపినట్లు తెలిసింది. ముఖ్యంగా వారి బాల్యానికి అంతరాయం కలిగించడం వల్ల పిల్లలు చాలా ప్రభావితమయ్యారని అధ్యయనం తెలిపింది. కోవిడ్ ప్రారంభమైనప్పటి నుంచి పిల్లల్లో మానసిక సమస్యలు మొదలయినట్లు సర్వే తెలిపింది.
పిల్లలను మానసికంగా దెబ్బ తీసిన కోవిడ్… సర్వేలో వెల్లడి.
-