ఇండియాలో కరోనా కేసుల తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతుంది. గత కొన్ని రోజులుగా కరోనా రోజూవారీ కేసుల సంఖ్య 15 వేల కన్నా తక్కువగానే ఉంటుంది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 10549 కరోనా కేసులు నమోదైతే…488 మరణాలు సంభవించాయి. దేశంలో మొత్తం కేసులు, మరణాల విషయాలను పరిశీలిస్తే…
మొత్తం కరోనా కేసులు- 3,45,55,431
మరణాలు-4,67,468
యాక్టివ్ కేసులు- 1,10,133
ప్రపంచ వ్యాప్తంగా కేసుల సంఖ్య ఎక్కువగా అమెరికాలో నమోదైంది. తరువాతి స్థానాల్లో ఇండియా, బ్రెజిల్, యూకే, రష్యా దేశాలు ఉన్నాయి. ఆయా దేశాల్లో కేసుల సంఖ్య మరణాల సంఖ్యను పరిశీలిస్తే ఈ విధంగా ఉన్నాయి.
అమెరికా- 48,126,373, మరణాలు (775,785)
ఇండియా- 34,555,431, మరణాలు (467,468)
బ్రెజిల్- 22,055,238, మరణాలు (613,642)
యూకే- 10,076,115, మరణాలు (144,875)
రష్యా- 9,303,751, మరణాలు (263,934)