దేశంలో కరోనా ఖతం అయింది. గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు సంఖ్య గణనీయంగా తగ్గాయి. గత కొన్ని రోజులుగా ఇండియాలో కరోనా కేసుల తీవ్రత చాలా వరకు తగ్గింది. కొన్ని రోజులుగా… కేసుల సంఖ్య 10 వేలకు దిగువనే నమోదు అవుతున్నాయి. థర్డ్ వేవ్ పూర్తిగా తగ్గిపోయింది.
గడిచిన 24 గంటల్లో దేశంలో కేవలం 4184 కొత్త కోవిడ్ కేసుల మాత్రమే నమోదు అయ్యాయి. 104 మరణాలు మాత్రమే సంభవించాయి. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 44,488 గా ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 4,24,20,120 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనా బారిన పడి ఇప్పటి వరకు 5,15,459 మంది మరణించారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. దీని ఫలితంగానే గత డిసెంబర్, జనవరిలో కేసుల సంఖ్య భారీగా నమోదు అవుతున్నా… మరణాలు పెద్దగా కనిపించ లేదు. ప్రస్తుతం దేశంలో 179,53,95,649 వ్యాక్సిన్ డోసులను అందించారు.