దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా సాగుతోంది. ఇటీవలే ఇండియా 100 కోట్ల డోసుల రికార్డను దాటింది. దేశంలో 60 శాతం కన్నా ఎక్కువ జనాభా కనీసం ఒక్కడోసు వ్యాక్సిన్ అయినా తీసుకున్నారు. అయతే కొన్ని రాష్ట్రాలు మాత్రం వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వెనుకబడి ఉన్నాయి. దీంతో వీటిపై కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధ తీసుకోనుంది. తాజాగా ప్రధాన మంత్రి మోదీ వ్యాక్సినేషన్ కార్యక్రమం పై సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
వ్యాక్సినేషన్ కార్యక్రమంపై మోదీ మీటింగ్.. ఆ రాష్ట్రాల సీఎంలు, అధికారులతో సమావేశం
-