సాధారణంగా చెట్లు కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకుని ఆక్సిజన్‌ను మన కోసం వదులుతాయి కదా. అయితే ఆవులు కూడా దాదాపుగా అదే పని చేస్తాయట. ఆవులు ఆక్సిజన్ పీల్చుకుని ఆక్సిజన్‌నే విడిచిపెడతాయట.
హిందువులకు ఆవు ఎంతో పవిత్రమైన జంతువు. ఆవును వారు పూజిస్తారు. కోరిన కోర్కెలు నెరవేరుతాయని చెప్పి చాలా మంది గోమాతలను పూజిస్తుంటారు. ఇక ఆవు పాలు, మూత్రం, పేడలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని సాక్షాత్తూ సైంటిస్టుల పరిశోధనల్లోనే వెల్లడైంది. అయితే ఇవన్నీ మనకు తెలిసిన పాత విషయాలే. కానీ ఆవు గురించిన మనకు తెలియని ఓ కొత్త విషయాన్ని ఆయన మనకు చెప్పారు. ఇంతకీ ఆయన ఎవరు..? ఆవు గురించి మనకు ఆయన చెప్పిన ఆ విషయమేమిటంటే…
ప్రస్తుతం మన దేశ రాజకీయాలన్నీ ఆవు చుట్టూనే తిరుగుతున్నాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ ఆవు రాజకీయమనే పుండును మరింత పెద్దది చేస్తున్నాయి. సాధారణంగా చెట్లు కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకుని ఆక్సిజన్‌ను మన కోసం వదులుతాయి కదా. అయితే ఆవులు కూడా దాదాపుగా అదే పని చేస్తాయట. ఆవులు ఆక్సిజన్ పీల్చుకుని ఆక్సిజన్‌నే విడిచిపెడతాయట. ఈ క్రమంలో ఆక్సిజన్‌ను వదిలే ఏకైక జీవి ఆవు మాత్రమేనని ఆయన అన్నారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలపై చాలా మంది వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
సీఎం త్రివేంద్రసింగ్ కేవలం పై వ్యాఖ్యలు మాత్రమే కాకుండా.. ఆవుకు రోజూ మర్దనా చేస్తే శ్వాస సంబంధ సమస్యలు దూరమవుతాయని కూడా అన్నారు. దీంతో ఆయన్ను ఇప్పుడందరూ విమర్శిస్తున్నారు. నెటిజన్లయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు వేస్తున్నారు. సీఎం త్రివేంద్ర సింగ్ సైంటిస్టులకే తెలియని గొప్ప విశేషాలు చెబుతున్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా.. ఇలాంటి నేతలు ఉన్నంత కాలం మన దేశం ఇలాగే ఉంటుంది. అందులో ఎలాంటి మార్పూ రాదు..!