వికారాబాద్‌ కాల్పులు వారి పనే.. పట్టేసిన పోలీసులు !

వికారాబాద్‌ అడవుల్లో ఆవు మీద కాల్పుల ఘటనలో పురోగతి సాధించారు పోలీసు అధికారులు. ఆవుపై కాల్పులు జరిపిన నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇమ్రాస్‌, మహామీర్ అజీర్‌, షేక్‌ మహబూబ్‌, రాంచందర్‌, రఫీలు ఈ కాల్పులు జరిపినట్టు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరా ఆధారంగా పోలీసులు ఈ కేసును ఛేదించారు. ఇమ్రాస్‌, హజార్‌ కాల్పులకు పాల్పడినట్లు గుర్తించారు.

అడవులకు వెళ్లి వేటాడటం వీళ్లకు సరదా అని చెబుతున్నారు పోలీసులు. ఇమ్రాస్ వేటకు ముందు రెక్కీ నిర్వహించాడని అంటున్నారు. హజార్‌ నుంచి రైఫిల్, 9 బుల్లెట్‌లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే ఇమ్రాస్‌ పరారీలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న పోలీసులు పలు కేసులు నమోదు చేశారు.