ఏపీ రాజకీయాల్లో టిడిపి అధినేత చంద్రబాబు అత్యంత సీనియర్ నేత అనే సంగతి తెలిసిందే. దాదాపు 40 ఏళ్ళు పైనే రాజకీయం చేసిన నాయకుడు..ఇప్పుడు ఆయన వయసు దాదాపు 73 పైనే..ఇంకా రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. ఒకవేళ టిడిపి అధికారంలోకి వస్తే 80 ఏళ్ల వరకు రాజకీయాల్లోనే ఉంటారు. అంటే 50 ఏళ్ల రాజకీయ జీవితం.
ఇటు వైసీపీ అధినేత, సిఎం జగన్ రాజకీయ జీవితం 15 ఏళ్ళు కూడా లేదు. ఆయన వయసు 50 ఏళ్ళు కూడా లేవు..అంటే ఆయన ఇంకా 30 ఏళ్ల పాటు రాజకీయం చేయవచ్చు. కానీ ఆయన రాజకీయ జీవితాన్ని త్వరగా ముగించేలా ఉన్నారని..జగన్ రాజకీయ జీవితానికి జగనే ముగింపు పలుకుతున్నారని సిపిఐ నేత నారాయణ అంటున్నారు. తాజాగా ఆయన జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పదికాలాలు ఉండాల్సిన వాడు .. తన రాజకీయానికి తనే ముగింపు పలుకుతున్నారని, వైసీపీ వాళ్ళే కొట్టి, దాడులు చేసి.. పట్టాభి పై కేసులు పెట్టారని, కుటుంబంలో కూడా శత్రుశేషం ఉండకూడదని జగన్ భావించారని అన్నారు.
జగన్ పరమ దుర్మార్గుడని, పట్టాభి ఆరోగ్యం విషయంలో డాక్టర్లు తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చారని, ఏపీలో డాక్టర్లు తీరును ఖండిస్తున్నామన్నారు. ఇక కాంగ్రెస్, కమ్యూనిస్టులకు శత్రుత్వం ఏమీ లేదని, రేవంత్ రెడ్డి పాదయాత్రకు సీపీఐ నేతలు మద్దతులో తప్పేముందని అన్నారు.
అలాగే లోకేష్ పాదయాత్ర చేస్తే జగన్‌కు భయమెందుకని, చంద్రబాబును ముసలివాడంటోన్న వైసీపీ, ఆయన పర్యటనలని ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారని ప్రశ్నించారు. మొత్తానికి నారాయణ..జగన్ టార్గెట్ గా విరుచుకుపడ్డారు. ఇటు ఏపీలో టీడీపీకి, అటు తెలంగాణలో కాంగ్రెస్ కు మద్ధతు సిపిఐ ఉంటున్నట్లు తెలుస్తోంది. కానీ తెలంగాణలో బిఆర్‌ఎస్ తో కలిసి సిపిఐ ముందుకెళుతుంది. కానీ రేవంత్ రెడ్డి పాదయాత్రకు సిపిఐ మద్ధతు ఇస్తుంది. చివరికి సిపిఐ ఎవరి వైపు వెళుతుందో చూడాలి.