టాలీవుడ్ లో సినీ కార్మికులు అందరూ రోడ్డున పడ్డారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. హీరోలకు కోట్లలో పారితోషకం ఇస్తారు కానీ కష్టపడే కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వడం లేదంటూ సిపిఐ నారాయణ ప్రశ్నించారు. హీరో, హీరోయిన్లకు సొగసులు దిద్దే కార్మికులను విస్మరిస్తారా అంటూ ఫైర్ అయ్యారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ మేకప్ లేకుండా ఎలా ఉంటారు ఓసారి ప్రతి ఒక్కరూ ఆలోచించండి అంటూ సిపిఐ నారాయణ హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం సిపిఐ నారాయణ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీంతో సిపిఐ నారాయణపై రజనీకాంత్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సినీ పరిశ్రమలో ఎంతోమంది హీరోలు హీరోయిన్లు ఉన్నారు. వారందరినీ వదిలిపెట్టి రజనీకాంత్ పై మీరు ఇలా కామెంట్లు చేయడం సరికాదు అంటూ మండిపడుతున్నారు. సిపిఐ నారాయణ రజనీకాంత్ కు క్షమాపణలు చెప్పాలి అంటూ కొంతమంది సీరియస్ అవుతున్నారు. మరి దీనిపై రజనీకాంత్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.