Cm Revanth Reddy : ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయడానికి పది రోజులు చాలు అంటూ వ్యాఖ్యనించారు. కోర్టు తీర్పు మేరకు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు.
42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ కమిట్మెంట్ నిరూపించుకున్నాం…. మా చిత్తశుద్ధిని ఎవరూ ప్రశ్నించలేరన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.మా పోరాటం కేంద్రంపై కాబట్టి జంతర్ మంతర్ వద్ద మా గొంతు వినిపించామన్నారు.
కేసీఆర్ ఆర్డినెన్స్ తెచ్చారు కాబట్టి సవరించిన ముసాయిదా గవర్నర్ కి పంపామని వెల్లడించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మోదీ చేతుల్లోనే బీసీ రిజర్వేషన్ నిర్ణయం ఉంది…రాష్ట్రపతికి రాజకీయాలకు సంబంధం లేదన్నారు. మోదీ చేతుల్లో రాష్ట్రపతి ఉన్నారా అదైనా చెప్పండి అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.