కాల్పలు ఆపండి..శాంతిని నెలకొల్పాలని అమిత్ షాకు సీపీఐ పార్టీ లేఖ

-

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలు, జిల్లాల్లో కాల్పులు ఆపాలని, శాంతిని నెలకొల్పాలని సీపీఐ (మావోయిస్టు) పార్టీ కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాసింది. ఈ సందర్భంగా కాల్పుల విరమణ, శాంతి చర్చల కోసం శాంతి సంభాషణ కమిటీని ఏర్పాటు చేసినట్లు లేఖలో పేర్కొంది. కమిటీకి చైర్మన్‌గా జస్టిస్ చంద్ర కుమార్ (మాజీ), ఉపాధ్యక్షుడిగా జంపన్న అలియాస్ నరసింహా రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ప్రొ.హర‌గోపాల్,కన్వీనర్‌గా దుర్గా ప్రసాద్, కో-కన్వీనర్లుగా జయ వింధ్యాల, డాక్టర్ తిరుపతయ్య, బాలకిషన్‌రావు, కందుల ప్రతాప్ రెడ్డి ఉన్నారని.. అమిత్ షాకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

శాంతి సభాషణ కమిటీ పౌర సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపారు. భద్రతా బలగాల చేత కాల్పుల విరమణ, శాంతి చర్చలు జరపడమే ఉద్దేశంగా ఈ కమిటీ ఏర్పడిందన్నారు. కమిటీలో న్యాయ నిపుణులు, ప్రొఫెసర్లు, వైద్యులు, మానవ హక్కుల నిపుణులు, జర్నలిస్టులు, సమాజంలోని వివిధ వర్గాల ప్రజా నాయకులు సభ్యులుగా ఉన్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news