ఏపీ ఐటీ అండ్ పరిశ్రమల శాఖ మంత్రి నారాలోకేశ్ ఆదివారం తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో పర్యటించారు. ఈ సందర్బంగా 100 పడకల ఆస్పత్రికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక నేతలు ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు.
మంగళగిరి ప్రజల మనసు గెలుచుకోవాలని చాలా కష్టపడ్డాను అని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉండాలని సీఎం చంద్రబాబు ప్రతిపాదించారని.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం టీడీపీ తరఫున ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని ఈ సందర్భంగా నారా లోకేశ్ వెల్లడించారు.