5 వతేదీన కర్నూల్ లో వైసీపీ సీమ గర్జన పేరుతో వైసీల్ ధర్నా కార్యక్రమం చేపట్టిందని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు చేయాల్సిన ఉద్యమాలను అధికార పార్టీ చేస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రివర్స్ గవర్నమెంట్ ప్రతిపక్షాలు చేయాల్సిన పని కూడా అధికార పార్టీ చేస్తుందన్నారు. ఎవరిని మోసం చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టాలని అడుగుతున్నాను,జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలి. కర్నూల్లో హైకోర్టు పెడతామంటే ఎవరు అడ్డం వచ్చారు, పెట్టాల్సింది కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. కర్నూల్ లో హైకోర్టు పెడతామని చెప్పి పెట్టకుండా మోసం చేసి ఈరోజు సీమ గర్జన పేరుతో ధర్నా పెడతామని ప్రభుత్వం అంటుంది. సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున వాదించిన న్యాయవాది హైకోర్టు అమరావతిలోని ఉంటుందని చెప్పారు. మూడున్నర ఏళ్లలో రాయలసీమకు ఏం చేశారు. హంద్రనీవాను రెండింతలు చేస్తానని చెప్పి, కనీసం ఇప్పుడు నీళ్లు కూడా ఇవ్వడం లేదు. గండికోట ప్రాజెక్టు సీఎం సొంత నియోజకవర్గంలో ఉంది, కానీ ఒక్క ఎకరానికి నీళ్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదు.
రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు బయటకు వెళ్ళిపోతున్నాయి. ఈ అనుబంధ పరిశ్రమలు రాకుండా దూరంగా ఉన్నాయి. అమర్ రాజా కంపెనీ ద్వారా 9000 మందికి ఉపాధి ఇచ్చారు. 50 వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతారు. అమర్ రాజా కంపెనీ. తెలంగాణకు తరలిపోతుంది. ఒకరి తర్వాత ఒకరు రాష్ట్రం నుంచి వెళ్ళిపోతున్నారు, దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. కడపలో స్టీల్ బ్యాండ్ పెడతామని శంకుస్థాపన చేశారు పది అడుగులు సైతం ముందుకు వెళ్లడం లేదు. వైసీపీ దౌర్జన్యాలకు భయపడి ఎవరు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం లేదు. కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని 9 నుంచి 13 వరకు కడపలో పాదయాత్ర చేస్తాం. పాదయాత్రకు ప్రజాసంఘాలను రాజకీయ పార్టీలన్నిటిని ఆహ్వానిస్తున్నాను.’ అని రామకృష్ణ అన్నారు.