ఆ బాధలను గుర్తు చేసుకుంటే ఒళ్లు జలధరిస్తుంది : సీఎం కేసీఆర్‌

-

సీఎం కేసీఆర్‌ నేడు మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని పాలమూరు జిల్లా కలెక్టరేట్ణు ప్రారంభించారు. అయితే.. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కంటి వెలుగు పథకం ఓట్ల కోసం తెచ్చింది కాదని, దీని వెనుక ఎంతో పరమార్థం ఉందని స్పష్టం చేశారు. సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ‘చక్కటి పరిపాలన భవనాన్ని మంజూరు చేసుకోవడమే కాకుండా పూర్తి చేసుకొని.. ప్రారంభోత్సవం చేసుకున్నందుకు అభినందనలు తెలుపుతున్నానన్నారు. ఏడేళ్ల క్రితం 60వేలకోట్ల రూపాయల బడ్జెట్‌ ఉండే తెలంగాణ.. నేడు 2.50లక్షల కోట్ల వరకు ఖర్చుపెట్టే వరకు రాగలిగామన్నారు సీఎం కేసీఆర్‌. ఏడేళ్ల కిందట చాలా భయంకరమైన కరెంటు బాధలు అనుభవించిన తెలంగాణ నేడు.. దేశానికే తలమానికంగా, మనకు సమీపంలో ఏ రాష్ట్రం లేనివిధంగా, నేషనల్‌ యావరేజ్‌ క్లోజ్‌గా లేకుండా దేశంలో తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ నెంబర్‌ వన్‌ అని చెప్పేందుకు గర్వపడుతున్నానన్నారు సీఎం కేసీఆర్‌. సంక్షేమ పథకాల్లో సాటిగానీ, పోటిగానీ లేరు.

ఎవరికీ అలాంటి ఆలోచనలురావు. నిబద్ధతతో పని చేసినటువంటి మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, వారితో పాటు రెండింతల అకింతభావంతో పనిచేసినటువంటి ప్రభుత్వ సిబ్బంది. ఇంత గొప్ప ఆవిష్కరణ చేసినందుకు ప్రభుత్వ అధికారులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు సీఎం కేసీఆర్‌. తెలంగాణ ఉద్యమ కాలంలో పాలమూరు జిల్లా పర్యటించిన సమయంలో అనేక జ్ఞాపకాలు. ఆలంపూర్‌ నుంచి జోగులాంబ వరకు పాదయాత్ర తెలంగాణ ఉద్యమంలో తొలిభాగంలో చేస్తే అనేకమైన అనుభవాలు, బాధలు. జ్ఞాపకం చేసుకుంటే ఒళ్లు జలధరించే పరిస్థితి. నడిగడ్డలో ప్రజల పరిస్థితి చూసి నిరంజన్‌రెడ్డి, నేను అంతా కండ్లనీళ్లు పెట్టుకున్నాం. వేధనలు, రోధనలు, గుండవిసేలా బాధలతోని బాధపడ్డ పాలమూరు జిల్లా ఈ రోజు చాలా సంతోషంగా ఉంది నాకు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో పంటల కోతలు కోసే హార్వెస్టర్లు, కల్లాల్లో ధాన్యం రాశులు చూసి ఆనందపడ్డా అని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version