సాధారణంగా డైరెక్టర్ అంటే బిహైండ్ ది స్క్రీన్ హీరో. అన్నీ తానై చూసుకుంటూ సినిమాను తెరకెక్కిస్తారు. కొంతమంది దర్శకులు తమ కథలను తామే రాసుకుంటే, మరి కొంతమంది ఇతర రచయితల కథలను వెండితెరపై చూపిస్తుంటారు. ఎంతో మంది రచయితలు కూడా సిల్వర్‌స్క్రీన్ డైరెక్టర్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నవారున్నారు. స్టార్ డైరెక్టర్స్ కూడా ఎదిగారు. అలాంటి వారిలో కొరటాల శివ ఒకరు.
కొరటాల శివ ఒకప్పుడు రచయితగా పలు సినిమాలకు కథలను అందించారు. కొరటాల సినిమాలపై ఉన్న ఆసక్తితో కెరీర్ ఆరంభంలో తన మేనమామ పోసాని కృష్ణ మురళి వద్ద అసిస్టెంట్‌గా పనిచేశారు. అంతే కాకుండా పలు చిత్రాలకు స్క్రీన్ రైటింగ్ అసిస్టెంట్‌గా కూడా పనిచేశారు. మున్నా, బృందావనం, ఒక్కడున్నాడు సహా పలు చిత్రాలకు స్క్రీన్ రైటింగ్ చేశారు.
ఇక 2013లో మిర్చి సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ తర్వాత కొరటాల ఇండస్ట్రీలో వరుస అవకాశాలను అందుకున్నారు. అదే విధంగా జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, భరత్ అనే నేను లాంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. ఇక రీసెంట్గా రూపొందించిన ఆచార్య మాత్రం దెబ్బకొట్టింది.
అయితే కొరటాల ఒకానొక సందర్భంలో తన క్రెడిట్ మరొకరు కొట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను సింహా సినిమాకు రచయితగా పనిచేశానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కానీ తన పేరును టైటిల్స్‌లో వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తాను దర్శకుడిగా అవ్వడానికి అది కూడా ఒక కారణం అయ్యిందని అన్నారు.