Anchor Suma: సిల్వ‌ర్ స్క్రీన్ మీద సంద‌డి చేయ‌నున్న స్మాల్ స్క్రీన్ క్వీన్ !

-

Anchor Suma: యాంక‌ర్ సుమ.. బుల్లి తెర ప్రేక్ష‌కులకు ప్ర‌త్యేక ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. వేదిక ఏదైనా.. వేడుక ఎక్క‌డైనా.. త‌న వాయిస్ వినిపించాల్సిందే.. త‌న ఇనిస్టెంట్ పంచ్‌ల వ‌ర్షం కురిపించాల్సిందే. బుల్లితెర లో ఏ ఛానల్లో చూసిన‌ మార్చినా ఆమె బొమ్మ కనిపించాల్సిందే. గత రెండు దశాబ్దాలుగా తన వాక్చాతుర్యంతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తున్న స్టార్ యాంకర్ సుమ కనకాల. బుల్లితెర లేడీ సూపర్ స్టార్‌గా తిరుగులేని హవా ప్రదర్శిస్తోన్న సుమ.. తర్వలో సిల్వ‌ర్ స్క్రీన్ పై ద‌ర్శ‌నమివ్వ‌నున్న‌ది.

ఇప్ప‌టికే బుల్లి తెర యాంక‌ర్స్ అన‌సూయ‌, ర‌ష్మీ వెండి తెర మీద కూడా రాణిస్తున్నారు. ఈ వారి బాట‌లోనే సుమ కూడా వెండితెర ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుండ‌ట‌. సుమ త‌న కెరీర్ తొలుత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వ‌చ్చిన క‌ళ్యాణ ప్రాప్తిర‌స్తు అనే సినిమాలో హీరోయిన్ గా మెప్పించింది. కానీ, స‌రైన అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో బుల్లితెర‌కు ప‌రిమిత‌మైంది. త‌నదైన స్టైల్ తో .. యాంక‌రింగ్ చేస్తూ మంత్ర‌ముగ్ధుల‌ను చేస్తుంది.

ఇదిలా ఉంటే.. గత కొంత కాలంగా సుమ సినిమాల్లో న‌టించ‌నున్నద‌ట అనే వార్త‌లు నెట్టింట తెగ వైరల్ అవుతున్న నేపథ్యంలో.. తాజాగా సుమ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ‘అందరు నన్ను వెండితెరకు ఎప్పుడు వస్తున్నావ్ అని అడుగుతున్నారు. కనుక ఒక సారి ప్రయత్నిస్తే పోలా.. అంటూ తన స్టైల్లో చెప్పేశారు. పలువురు సెలబ్రిటీలు తన గురించి మాట్లాడిన వీడియో క్లిప్స్ కట్ చేసి ఓ వీడియో రెడీ చేశారు. దీంతో సుమ రీ ఎంట్రీ పక్క అని అర్ధమైంది. అందులోను పూర్తి వివరాలు మరికొన్ని రోజుల్లో ఉండనున్నట్లు తెలిపింది. ఇక ఏ చిత్రంలో న‌టించ‌న్న‌ది? ఆ చిత్రానికి డైరెక్టర్ ఎవరు..? సుమ ఏ రోల్
చేయ‌బోతుంది? అనే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తున్నాయి సోష‌ల్ మీడియాలో.. వెండి తెర మీద ఏవిధంగా రానిస్తుందో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version