ప్రభాస్‌ కల్కి ట్రైలర్‌ లాంఛ్ టైంపై క్రేజీ అప్డేట్..!

-

మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా  హీరో ప్రభాస్  నటిస్తోన్న తాజా చిత్రం కల్కి 2898 ఏడీ . సైన్స్ ఫిక్షన్‌ జోనర్‌లో వస్తోన్న ఈ సినిమాని మే 9 న 2024లో  రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌లో వచ్చి ట్రెండ్‌ సెట్టర్స్‌గా నిలిచిన జగదేకవీరుడు అతిలోక సుందరి, మహానటి చిత్రాలు ఇదే రోజు రిలీజైన సంగతి  తెలిసిందే.ఈ చిత్రం లో అమితాబ్‌, కమల్‌హాసన్‌, దీపిక పదుకొణే, దిశా పటానీ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.ఇప్ప‌టికే ఈ చిత్రం  నుంచి విడుదల అయిన పోస్ట‌ర్స్, గ్లింప్స్‌ల‌కు మంచి స్పందన వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ మూవీ  షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ మూవీ  ట్రైలర్‌ అప్‌డేట్‌కు సంబంధించిన పుకారు  ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తోంది. లేటెస్ట్ టాక్‌ ప్రకారం ఏప్రిల్ మొదటి వారంలో కల్కి 2898 ఏడీ ట్రైలర్‌ను లాంఛ్ చేసేందుకు మేకర్స్‌ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news