క్రెడిట్ కార్డు లోన్ ఎక్కువ అధికంగా ఉందా.. అయితే ఇలా చేయండి..!

-

చాల మంది క్రెడిట్ కార్డుని వాడుతుంటారు. ఇక వ్యక్తిగత రుణగ్రహీతల్లో ముఖ్యంగా క్రెడిట్ కార్డు కలిగి ఉన్నవారు ఆరు నెల తాత్కాలిక రుణనిషేధం పూర్తయిన తర్వాత డెబ్ట్ చెల్లించాలి. ఆరు నెలల కాలపరిమితిలో తాత్కాలిక నిషేధాన్ని ఎంచుకున్న క్రెడిట్ కార్డు వినియోగదారుల వడ్డీ పెరగడమే కాకుండా… నెలవారీగా చెల్లించే వాయిదాలు కూడా పెరుగుతాయని నిపుణులు తెలిపారు.

credit cards
credit cards

ఇక అధిక క్రెడిట్ కార్డు బకాయిలు, వడ్డీ రేటు భారాన్ని తగ్గించుకునేందుకు తక్కువ వడ్డీ రేటున్న మరో క్రెడిట్ కార్డుకు బదిలీ చేయవచ్చునని వారు అన్నారు. అయితే ఇది రుణ భారాన్ని తగ్గించుకోవాలనుకునే వినియోగదార్లకు.. క్రెడిట్ కార్డు కంపెనీలు తక్కువ వడ్డీకే తమ బ్యాలెన్సును బదిలీ చేసుకునే సౌకర్యం అందించే అత్యంత సాధారణ సదుపాయం అని అన్నారు. ఇక ఎవరైతే బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్ సదుపాయాన్ని ఎంచుకుంటారో వారు తక్కువ వడ్డీకే బకాయి మొత్తాన్ని చెల్లించడంతో పాటు జరిమానా చెల్లించాల్సిన అవసరం ఉండదు అని చెప్పారు.

అయితే ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను కలిగి ఉండి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే.. ప్రతి కార్డుకు చెల్లించాల్సిన కనీస మొత్తాన్ని ఎలాంటి వైఫల్యం లేకుండా చెల్లించేందుకు ప్రయత్నించండని అన్నారు. ఇలా చేయడంలో విఫలమైనట్లయితే భవిష్యత్తు ప్రణాళికలో భాగంగా మీరు తిరిగి చెల్లించే రీపేమెంట్స్ లో జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అధిక వడ్డీతో క్రెడిట్ కార్డు బకాయిని తిరిగి చెల్లించేందుకు మీరు ప్రాధాన్యమిచ్చి రుణ భారం తగ్గించుకోవచ్చునన్నారు.

అంతేకాదు క్రెడిట్ కార్డు రుణభారాన్ని తగ్గించుకోవాలంటే మరో మార్గం. బకాయిలను ఈఎంఐల రూపంలో మార్చండని అన్నారు. ఈ రేటు సాధారణంగా చెల్లించే వడ్డీ కంటే తక్కువగా ఉంటుందన్నారు. క్రెడిట్ కార్డ్ బకాయిలు సాధారణంగా నెలవారీ ప్రాతిపదికన క్లియర్ చేయవలసి ఉంటుందని పేర్కొన్నారు. ఇది విఫలమైతే అధిక వడ్డీ రేటును చెల్లించాలన్నారు. మీ మొత్తం వడ్డీ భారాన్ని తగ్గించడానికి మీ బ్యాంక్ ఇచ్చిన ‘కన్వర్ట్ టు ఇఎంఐ’ ఆప్షన్ ను ఎంపికను చేసుకోవాలని పేర్కొన్నారు.

ఎక్కువ వడ్డీతో క్రెడిట్ కార్డు రుణం చెల్లించాల్సివస్తే వ్యక్తిగత రుణాలను ఎంచుకోవడం మంచిది. వ్యక్తిగత రుణాలు ఎక్కువ వడ్డీకి వచ్చినప్పటికీ ఇది క్రెడిట్ కార్డుల రేటు కంటే చాలా తక్కువ. మీరు క్రెడిట్ కార్డులో ఉన్న బకాయి మొత్తాన్ని లెక్కించవచ్చు. అంతేకాకుండా చౌకైన వడ్డీ రేటును అందించే బ్యాంకు నుంచి రుణం పొందవచ్చు. అప్పుడు మీరు మీ క్రెడిట్ కార్డు రుణాలను క్లియర్ చేసుకోవచ్చునని తెలిపారు.

ఇక క్రెడిట్ కార్డు ఖాతాదారులు ఉద్యోగం లేక ఆదాయం తగ్గిపోయి ఈ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిలో, క్రెడిట్ కార్డ్ క్రమశిక్షణ – అనవసరమైన వస్తువులపై ఖర్చు చేయకుండా మిమ్మల్ని మీరు నిరోధించుకోవడం ముఖ్యం. సాధారణ నియమాలను పాటిస్తే క్రెడిట్ కార్డుల నిర్వహణ చాలా సులభం అని నిపుణులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news