అదిరిపోయే పోస్టల్ ఇన్సూరెన్స్…తక్కువ ప్రీమియం కూడా..!

-

మీరు ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే దీనికి సంబంధించి వివరాలు చూడాల్సిందే. రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ గురించి అందరికీ తెలిసినదే. ఇది పోస్టాఫీస్ తరుపున కస్టమర్లకు ఇన్సూరెన్స్ పాలసీలు అందిస్తూ ఉంటుంది. అయితే వీటిలో గ్రామ్ సుమంగల్ స్కీమ్ కూడా ఒకటి.

 

దీని వలన ఎక్కువ రాబడి పొందొచ్చు. పైగా ప్రీమియం కూడా తక్కువే. దీనిలో గరిష్టంగా రూ.10 లక్షల మొత్తానికి పాలసీ తీసుకోవచ్చు. నిర్ణీత కాల వ్యవధుల్లో పాలసీదారులకు డబ్బులు వస్తాయి. పాలసీదారుడు మరణిస్తే కనుక నామినీకి పాలసీ డబ్బులు వస్తాయి. ఇంకా బోనస్ కూడా లభిస్తుంది.

ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాల లోకి వెళితే.. 20 ఏళ్ల కాల పరిమితి తో పాలసీ తీసుకుంటే అప్పుడు 8, 12, 16 ఏళ్లలో పాలసీ డబ్బులు 20 శాతం చొప్పున వస్తాయి. మిగతా 40 శాతం డబ్బులు మెచ్యూరిటీ సమయం లో మీకు వస్తాయి. 25 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తి 20 ఏళ్ల కాల పరిమితితో రూ.7 లక్షల మొత్తానికి పాలసీ తీసుకుంటే మొత్తంగా రూ.14 లక్షలు లభిస్తాయి. నెలకు రూ.2850 చెల్లిస్తే చాలు.

15 ఏళ్లు నుంచి 20 ఏళ్ల కాల పరిమితితో పాలసీ తీసుకోవచ్చు. మీరు 15 ఏళ్ల టర్మ్‌తో పాలసీ తీసుకుంటే మీకు 6, 9, 12 పాలసీ టర్మ్స్‌లో 20 శాతం చొప్పున డబ్బులు వస్తాయి. మిగతా 40 శాతం డబ్బులు మెచ్యూరిటీ సమయం లభిస్తాయి. అప్పుడు మొత్తం డబ్బులు వచ్చినట్లు అవుతుంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version