మోహాలీ టెస్ట్ లో స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీ చేశాడు. శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్ట్ లో రవీంద్ర జడేజా సెంచరీ సహాయంతో టీమిండియా భారీ స్కోర్ చేస్తోంది. రవీంద్ర జడేజా 160 బాల్స్ లో 10 ఫోర్లుతో 100 రన్స్ చేశాడు. ప్రస్తుతం నాటౌట్ గా కొనసాగుతున్నాడు. రవీంద్ర జడేజాకు టెస్టుల్లో ఇది రెండో సెంచరీ. ప్రస్తుతం భారత్ స్కోర్ 467/7 గా ఉంది.
శ్రీలంకపై టీమిండియా ఆధిపత్యాన్ని కనబరుస్తోంది. టాప్ ఆర్డర్ తో పాటు లోయర్ ఆర్డర్ కూడా బాగా రాణిస్తోంది. నిన్న తొలిరోజు ఆటలో హనుమ విహారీ 58 పరుగులతో, విరాట్ కోహ్లీ 45 పరుగులతో, రిషబ్ పంత్ 96 పరుగులతో ఆకట్టుకున్నారు. ఈరోజు అశ్విన్ 61 పరుగులు చేసి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజ్ లో రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్ బ్యాటింగ్ చేస్తున్నారు. శ్రీలంక బౌలింగ్ లో సురంగ లక్మల్, లసిత్ ఎంబుల్దేనియా చెరో రెండు వికెట్లు పడగొట్టగా… విశ్వ ఫెర్నాండో, లహిరు కుమార, దనుంజయ డి సిల్వా తలో వికెట్ తీశారు.