అవును… టీం ఇండియాని మా వాళ్ళు తిట్టారు: ఆస్ట్రేలియా ప్రకటన

-

భారత్‌ తో జరిగిన మూడో టెస్టు సందర్భంగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో అభిమానుల ప్రవర్తనపై క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) తన నివేదికను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) కు సమర్పించింది. ఈ నివేదికలో… టెస్ట్ సమయంలో టీమ్ ఇండియా ఆటగాళ్ళు జాతి వివక్ష ఆరోపణలకు గురయ్యారని ఆస్ట్రేలియా బోర్డు ధృవీకరించింది. టెస్ట్ లో 3 మరియు 4 వ రోజు మహ్మద్ సిరాజ్ మరియు మరికొందరు భారత ఆటగాళ్లను తిట్టారని పేర్కొంది.

ఈ విషయంపై టీమ్ ఇండియా కూడా అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఈ మ్యాచ్ నుంచి బయటకు వచ్చేయడానికి ఫీల్డ్ అంపైర్ లు ఇండియాకు అవకాశం ఇచ్చారని కూడా తెలిసింది, కాని కెప్టెన్ అజింక్య రహానె ఆట మీద ఉన్న గౌరవం కోసం కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు అని పేర్కొన్నారు. 3 వ రోజు మీడియా తీసిన ఫోటోలలో అభిమానులు వివక్ష ఆరోపణలు చేయలేదు అని నేరస్థులను కనుగొనటానికి దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని సిఐ తెలిపింది.

ఈ విషయంపై సిఎ సొంతగా దర్యాప్తు చేస్తుందని అధికారులు వెల్లడించారు. ఇకపై ఇలాంటివి జరగకుండా తాము చర్యలు తీసుకుంటామని ఆస్ట్రేలియా పేర్కొంది. సిఎ ఈ విషయంపై దర్యాప్తు పూర్తి చేసిందని… నివేదిక అందుకునే వరకు తదుపరి చర్యలు తీసుకోవడానికి వేచి ఉంటామని పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా భారత ఆటగాళ్లకు క్షమాపణలు చెప్పింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version