ఏపీలో జోరుగా క్రికెట్ బెట్టింగ్లు…!

ఏపీలో జోరుగా క్రికెట్ బెట్టింగ్ లు మొదలయ్యాయి. ఇండియా పాక్ మ్యాచ్ లపై బెట్టింగ్ రాయుళ్ళ హడావుడి మొదలైంది. వికెట్టు వికెట్టుకు, ప్రతీ బౌండ్రీకి, సిక్సర్ కి కూడా ముందునుంచే బుకీలు జాతకాలు రాస్తున్నారు. టీం 11లో స్ధానం దక్కేదెవరికో అనే దానిపై మరో బెట్టింగ్ కొనసాగుతోంది. ఆన్లైన్ మార్కెట్ లో పాక్ పై వెయ్యి కి 2000, ఇండియా పై వెయ్యికి 1300 బెట్టింగ్ లు జరుగుతున్నాయి. మార్కెట్ లో పాక్ పై వెయ్యికి 4 వేలు, ఇండియా పై వెయ్యికి 2 వేలు బెట్టింగ్ లు పెడుతున్నారు.

దాంతో ఏపీ పోలీసులు బెట్టింగ్ మాఫియా పై ప్రత్యేక నిఘా పెట్టినట్టు సమాచారం. మొదటి బంతి నుండి.. చివరి బంతి వరకు బుకీలు బెట్టింగ్ లకు సిద్దం చేస్తున్నారు. ఎప్పటిలా కాకుండా.. ఆకర్షణీయమైన రేట్లు తో బుకీలు అకట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. గతంలో అరెస్ట్ చేసిన బుకీల పై ఏపీ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం. యువత క్రికెట్ బెట్టింగ్ లతో జీవితాలు నాశనం చేదుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.