హైదరాబాద్ : కారులో డెడ్ బాడీ కేసులో ట్విస్ట్..మరిదితో కలిసి భార్యే..!

హైదరాబాద్ హయత్ నగర్ హత్య కేసులో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదట గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు అనుకున్న పోలీసులు విచారణ తరవాత షాక్ అవుతున్నారు. కార్లో దారుణ హత్య కు గురి అయిన లారీ డ్రైవర్ ను కాచిగూడ కి చెందిన మహుమద్ ముస్తాక్ గా గుర్తించారు. మృతుడి భార్య, తమ్ముడు కలిసి పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసినట్లు గుర్తించారు.crime

హత్య జరిగిన అనంతరం డెడ్ బాడీనీ నగర శివారులలో పడేశారు. అయితే రోడ్డు పై కార్ ఆగిపోవడంతో కార్ లో మృత దేహం పై కారం చల్లి భార్య వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. భార్యను , మృతుడి తమ్ముడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అక్రమ సంబందంమే హత్య కు కారణం అని పోలీసులు నిర్ధారించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.