క్రికెట్: భారత ఆటగాళ్లపై జాతి వివక్ష వ్యాఖ్యాలు చేసిన ఆస్ట్రేలియా అభిమానులు..

-

ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న భారత ఆటగాళ్ళకు అడుగడుగునా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సిడ్నీలో జరిగిన మ్యాచులో స్లెడ్జింగ్ చేసి భారత ఆటగాళ్ళను రెచ్చగొట్టే ప్రయత్నం చేసారు. ఆ కామెంట్లపై ఇంకా విమర్శలు వస్తుండగానే, తాజాగా మరో సంఘటన జరిగింది. ఐతే ఈ సారి ఆస్ట్రేలియా అభిమానుల నుండి కామెంట్స్ వినిపించాయి. అది కూడా జాతి వివక్షకి సంబంధించినవి కావడం చర్చనీయాంశంగా మారింది.

నాలుగవ టెస్ట్ జరుగుతున్న బ్రిస్బేన్లో భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియా అభిమానులు అనుచిత వ్యాఖ్యలు చేసారు. సిరాజ్ ని మురికి వ్యక్తి అంటూ జాతి వివక్ష వ్యాఖ్యలు చేసినట్లు ఆస్ట్రేలియా వార్తా సంస్థ సిడ్నీ హెరాల్డ్ వెల్లడించింది. అలాగే ఆటగాడు సుందర్ పై కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసారని తెలిపింది. మరి దీనిపై ఆస్ట్రేలియా బోర్డ్, ఐసీసీ బోర్డ్ ఏమైనా చర్య తీసుకుంటుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version