ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ క్రికెట్ ఆడుతున్న టీమిండియా అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. సిడ్నీలో జరుగుతున్న మూడవ టెస్టులో అదిరిపోయే ఆటతీరుతో మ్యాచును డ్రాగా మలిచారు. ఇందులో అశ్విన్, హనుమ విహారిల భాగస్వామ్యం కీలకంగా వ్యవహరించింది. టెస్ట్ క్రికెట్ కి ఆదరణ తగ్గిపోతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు జరిగిన మ్యాచ్ అందరినీ ఉత్కంఠని రేకెత్తించింది. ఐతే ఈ మ్యాచులో టీమిండియా ఆటగాళ్ళు 18ఏళ్ల తర్వాత సరికొత్త చరిత్ర సృష్టించారు.
రెండవ ఇన్నింగ్స్ లో 131ఓవర్లు ఆడిన ఇండియా, 18ఏళ్ల తర్వాత 100కి పైగా ఓవర్లు ఆడి రికార్డు సృష్టించింది. 2002లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచులో 109.4ఓవర్లు ఆడిన టీమిండియా, ఆ తర్వాత మళ్లీ ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీ మ్యాచులోనే అన్ని ఓవర్లు ఆడగలిగింది. ఐతే ఈ టేస్ట్ మ్యాచులో స్లెడ్జింగ్ జరిగిందంటూ ఆస్ట్రేలియా ఆటగాళ్ళపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.