టీమిండియా యంగ్‌క్రికెటర్ రాహుల్ చహర్ పెళ్లి చేసుకున్నారు. గోవాలో తన లవర్ ఇషానితో రాహుల్ చహర్ మ్యారేజ్ గ్రాండ్ గా జరిగింది. టీమిండియా లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్ ఇషాని గత కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఈ ప్రేమ జంట ఎప్పుడు పెళ్లి పీటలెక్క బోతోందని అందరూ అనుకుంటున్న సమయంలో.. ఒక్కటయ్యారు.
22 సంవత్సరాల యంగ్ క్రికెటర్ రాహుల్ చహర్ తన లవర్ ఇసానీని లైఫ్ పార్టనర్ గా చేసుకున్న గుడ్ న్యూస్ ను అందరితో.. షేర్ చేసుకున్నాడు. గోవాలో వెడ్డింగ్ పిక్స్ ను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. మార్చి 9 వ తేదీన బుధవారం రాత్రి 9 గంటలకు క్రికెటర్ రాహుల్ చాహర్… ఇషానీని పెళ్లి చేసుకున్న తర్వాత పిక్స్ ను షేర్ చేస్తూనే అవర్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అని రాశాడు. రాహుల్ చాహర్, ఇషానీల పెళ్లి కి రాహుల్ కజిన్ బ్రదర్, టీమిండియా అప్ కమింగ్ ఆల్ రౌండర్ దీపక్ చాహర్ తో పాటు మరికొందరు టీమిండియా క్రికెటర్లు పెళ్లికి హాజరు అయ్యారు.