చెన్నై సాలిగ్రామం శారదాంబాల్ వీధికి చెందిన సౌందర్య కోడంభక్కం మండలం 132 వార్డులో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తుంది. భర్త నుంచి విడిపోయి ఇద్దరు కుమారులతో నివాసం ఉంటోంది. వీరితో ఆమె అక్క కుమారుడు కూడా ఉంటున్నాడు. ఇటీవల సౌందర్యకు ఆమె మాజీ భర్త స్నేహితుడు విజయ్(27) తో వివాహేతర సంబంధం ఏర్పడింది.
కొద్ది నెలలుగా వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు. శుక్రవారం రాత్రి సౌందర్య ఇంట్లో విజయ్ హత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేసుకున్న విరుగంభక్కం పోలీసులు విచారణ చేపట్టారు. అందులో, సౌందర్యకు అదే ప్రాంతానికి చెందిన ప్రభు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. సౌందర్య తన ప్రియుడు ప్రభుతో కలిసి ఇంట్లో ఉన్న విజయ్ అడ్డు తొలగించుకోవడం కోసం హత్య చేసినట్లు అంగీకరించిందని పోలీసులు తెలిపారు.