వైజాగ్ లాడ్జిలో దారుణం చోటుచేసుకుంది. వైజాగ్ లాడ్జిలో శ్రీకాకుళం ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ప్రాణప్రదంగా ప్రేమించుకున్న వారిద్దరూ తమ పెళ్ళికి పెద్దలు అంగీకరించరు అన్న భయంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం చిన్న కొత్తపేట ప్రాంతానికి చెందిన కందివలస దామోదర్ డిగ్రీ చదువుతున్నాడు.
ఆముదాలవలస మండలంలోని బలగం గ్రామానికి చెందిన అదపాక సంతోషి కుమారి ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. ఇద్దరి మధ్య ఇటీవల ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరు మధ్య ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత ప్రేమ పెనవేసుకుపోయింది. సోమవారం మధ్యాహ్నం వీరిద్దరూ విశాఖపట్నం చేరుకొని దరిగొల్ల పాలెం లోని ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. నిన్న మధ్యాహ్నం అవుతున్న ఇద్దరు గది నుంచి బయటకు రాకపోవడంతో అనుమానించిన లాడ్జి సిబ్బంది తలుపు కొట్టారు. అయినప్పటికీ తీయకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూశారు. బాత్రూంలోని కిటికీ గది ఊచలకు ఇద్దరు ఉరివేసుకొని కనిపించారు.