మునుగోడు ఉప ఎన్నిక విషయంలో బిజెపి సంగతి తేల్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగాలని భావిస్తున్నట్టు టీఆర్ఎస్ లోని అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రతిపాదిత జాతీయ పార్టీ భారత రాష్ట్ర సమితికి మునుగోడు నుంచి ఊపిరి ఊదాలని కూడా సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు అవి వెల్లడించాయి.
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నేడో, రేపో రాష్ట్రానికి రానున్నారని ఆ వెంటనే ఆయన పూర్తిస్థాయిలో మునుగోడు పైన దృష్టి కేంద్రీకరించబోతున్నారని టిఆర్ఎస్ ముఖ్యులు తెలిపారు. బిజెపి ఆగడాల అంతు తేల్చడానికి మునుగోడు లోనే ఎన్నిక అయ్యేదాకా మకం వేయాలని కూడా కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు టిఆర్ఎస్ ముఖ్యుడు ఒకరు తెలిపారు.ఇదులో భాగంగానే భారీ వాహనశ్రేణితో మునుగోడుకు వెళ్లి, అక్కడే మకాం వేసి తాడోపేడో తేల్చుకోవాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు వారు పేర్కొన్నారు.