తమిళనాడులో విషాదం.. కరోనా భయంతో..తల్లి, కొడుకు సుసైడ్‌

-

తమిళనాడు రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది.. కరోనా భయంతో… తల్లీ, కొడుకు సూసైడ్‌ చేసుకున్న సంఘటన స్థానికంగా కలకలం రేపింది. మధురై ఎంజీఆర్‌ కాలనీలో నివాసం ఉంటున్న జ్యోతిక అనే మహిళకు నాలుగు రోజుల క్రితం జ్వరం వచ్చింది. అప్పటి నుంచి జ్వరంతో బాధపడుతోన్న ఆమె.. కరోనా వచ్చిందేమోనని భయానికి లోనైంది.

ఈ తరుణంలోనే… విషం తాగి ఆ కుటుంబం మొత్తం సూసైడ్‌ కు ప్రయత్నించింది. ఈ సంఘటన లో తల్లీ, కొడుకు మృతి చెందగా… మరో నలుగురు కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడ్డారు. ఇక విషయం తెలిసిన పోలీసులు… ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. అలాగే.. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా… తమిళనాడు ప్రతి ఆదివారం లాక్‌ డౌన్‌ ను విధించాలని నిర్ణయం తీసుకుంది. స్టాలిన్‌ సర్కార్‌ నిర్ణయం మేరకు ఇవాళ్టి ఆదివారం నుంచే ఈ లాక్‌ డౌన్‌ నిబంధన అమలులోకి రానుంది. తమిళ నాడు రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తమిళనాడు అంతటా నైట్‌ కర్ఫ్యూ విధించింది సర్కార్‌. దీంతో అన్ని రోజులలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కరోనా ఆంక్షలు అమలులోకి రానున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version