మూడునెలలుగా ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్న యువతి ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గన్నవరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…. విజయవాడ రూరల్ మండలం గూడవల్లికి చెందిన సొంగా శశి మరియు జి.మండలం కవులూరుకు చెందిన కంచర్ల అహల్య ఇద్దరూ గత కొద్దిరోజులుగా ప్రేమించుకుంటున్నారు. అంతే కాకుండా వీరిద్దరూ బంధువులేనని తెలుస్తోంది. కానీ వారి పెళ్లికి ఇంట్లోవాళ్లు నిరాకరించారు.
ఇక గత కొంత కాలంగా బ్యుటీషియన్ గా పనిచేస్తున్న అహల్య గూడవల్లికి వచ్చి సొంగా శశితో సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్టుగా తెలుస్తోంది. దాంతో అహల్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. అహల్య ఫ్యాన్ కు ఉరివేసుకున్న విషయాన్ని శశి కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మరణించినట్టు పోలీసులు తెలిపారు. దీనిపై అనుమానాస్పదమృతిగా కేసునమోదు చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.