ఏపీలో దారుణం…నాటు వైద్యం కోసం వెళ్ళిన మహిళపై అత్యాచార యత్నం.. ఆపై..!

-

ప్రకాశం జరుగుమల్లి మండలం కామేపల్లిలో దారుణం చోటు చేసుకుంది. అనారోగ్యంతో విజయమ్మ అనే మహిళ గ్రామంలో ఉన్న నాటు వైద్యుడు ఓబిశెట్టి ఓబయ్య వద్దకు వెల్లింది. అయితే విజయమ్మ వైద్యానికి వెళ్లిన సమయంలో మద్యం మత్తులో వైద్యుడు ఓబయ్య అత్యాచారం జరిపేందుకు ప్రయత్నించడంతో విజయమ్మ ప్రతిఘటించి. దాంతో గొంతు కోసి మహిళను ఓబయ్య హత్య చేశాడు.

మూడు గంటల పాటు ఓబయ్య శవాన్ని ఇంట్లో నే పెట్టుకుని ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలం వద్దకు వెళ్లి ఓబయ్యను తమ వాహనంలో ఎక్కించుకున్నారు. అయితే ఓబయ్యను గ్రామస్థులు బలవంతంగా పోలీస్ వాహనం నుండి దింపి దాడి చేయటంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా గ్రామస్తులు పట్టించుకోలేదు. దాంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version