భారీ వర్షాలకు కేరళ అతలాకుతలం అయింది. వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తం అయింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, నదులు పొంగిపొర్లి ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలోని 11 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా పథినంతిట్ట, ఇడుక్కి జిల్లాలు వర్షం కారణంగా తీవ్ర నష్టం ఏర్పడింది. భారీ వర్షాలు, మెరుపు వరదల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. తమిళనాడు, కేరళల మధ్య నడిచే నాలుగు రైళ్లను రద్దు చేశారు. వర్షాల కారణంగా ఇప్పటి వరకు 27 మంది ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్రం గమనిస్తోంది. వర్షాలపై ప్రధాని మోడీ, కేరళ సీఎం పినరయి విజయన్ తో మాట్లాడారు. మరోవైపు కేంద్రం అన్ని రక్షణ చర్యలు తీసుకుంటుందని హోం మంత్రి అమిత్ షా ట్విట్ చేశారు. మరో మూడు నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చిరస్తోంది. ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో పాటు నేవీ ఆపరేషన్ మదద్ పేరుతో ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తోంది.