అంబర్ పేట్‌లో నలుగురు విద్యార్థులు కనిపించకుండా పోయారు. ప్రేమ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలల ఎనిమిదో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు.. నిన్న జరిగిన పరీక్షలో కాపీ కొడుతుండగా టీచర్ పట్టుకున్నట్లు తెలిసింది.
ఈ విషయాన్ని మీ తల్లిదండ్రులకు చెప్తానని టీచర్ చెప్పినట్లు సమాచారం. దీంతో సాయంత్రం ఇంటికి వచ్చి డ్రెస్ మార్చుకున్న నలుగురు విద్యార్థులు ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. వీరు నలుగురు కలిసి వెళ్తున్న దృశ్యాలు సికింద్రాబాద్‌లోని సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. అందులో నికిత్, హర్ష, అజ్మత్ మరియు నితీష్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వారి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.