భార్య ఆ భాగాలపై వింత పేర్లు..అనుమానంతో భర్త దారుణం !

-

మల్కాజ్ గిరి మౌలాలి పరిధిలోని హనుమాన్ నగర్ లో లలిత (28), శంకర్ అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి పదేళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లయిన కొంతకాలానికి వీరికి ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు జన్మించారు. భర్త స్థానికంగా ఏదో పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అయితే గత కొంతకాలం నుంచి భార్య లలిత తరచూ ఫోన్ లో మాట్లాడుతుండడం భర్త చూశాడు.

దీంతో అప్పటి నుంచి భర్త భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఇక ప్రతిరోజు ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. పైగా ఈ క్రమంలోనే లలిత చేతిపై ఓ పేరును పచ్చబొట్టుగా వేసుకుంది. దీంతో అప్పటి నుంచి నా అనుమానం నిజమే అన్నట్లుగా భావించాడు భర్త.

ఇదే విషయమై భార్యాభర్తలు ఇటీవల కాలంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే మంగళవారం తెల్లవారుజామున సైతం భార్య భర్తల మధ్య గొడవ రాజుకుంది. అది చినిగి చినిగి తీవ్ర రూపం దాల్చడంతో కోపంతో ఊగిపోయిన భర్త చెక్కతో భార్య తలపై బలంగా బాదాడు. దీంతో లలిత రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version