శ్రీలంక పేలుళ్లు: నిర్వీర్యం చేస్తుండగా పేలిన మరో బాంబు

-

బస్టాండ్ దగ్గర 12 బాంబు డిటోనేటర్లు చెల్లాచెదురుగా పడి ఉండటంతో ఆ ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు. దీంతో మరో 75 డిటోనేటర్లు వాళ్లకు లభ్యమయ్యాయి. శ్రీలంక దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఎమర్జెన్సీని విధించారు.

నిజంగా దశాబ్ద కాలంలో ఇటువంటి దారుణ ఘటన అయితే జరగలేదు. సెలవు రోజున ప్రశాంతంగా ఉండాల్సిన శ్రీలంక ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బాంబుల మోతతో దద్దరిల్లింది. శ్రీలంకలో సంభవించిన బాంబు పేలుళ్ల ఘటనలో ఇప్పటి వరకు 300 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. 500 మందికి పైగా గాయపడ్డారు.

పోలీసులు ప్రతి అణువణువూ సెర్చ్ చేస్తున్నారు. మళ్లీ ఎటువంటి ప్రమాదం వాటిల్లకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొలంబోలోని ఓ చర్చి వద్ద బాంబు స్క్వాడ్ ఓ బాంబును నిర్వీర్యం చేయబోయింది. అయితే.. చిన్న తప్పిదం వల్ల ఆ బాంబు పేలింది. చర్చి వద్ద ఉన్న వ్యానులో ఆ బాంబు పేలింది. అయితే ఈ ఘటనలో ఎవరికైనా ప్రమాదం జరిగిందా అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. కొలంబోలోని ఓ బస్సు స్టేషన్ లో 87 బాంబు డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెట్టా ఏరియాలోని కొలంబో సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి వాటిని సీజ్ చేశారు.

బస్టాండ్ దగ్గర 12 బాంబు డిటోనేటర్లు చెల్లాచెదురుగా పడి ఉండటంతో ఆ ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు. దీంతో మరో 75 డిటోనేటర్లు వాళ్లకు లభ్యమయ్యాయి. శ్రీలంక దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఎమర్జెన్సీని విధించారు. ఈరోజు అర్ధరాత్రి నుంచే అత్యవసర స్థితిని విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version