ప్రభాస్.. ‘మిస్టర్ పర్ ఫెక్ట్’ సినిమా కథ కాపీయేనట.. కోర్టు తీర్పిచ్చింది..!

-

మిస్టర్ పర్ ఫెక్ట్ సినిమా రిలీజ్ 2011 లో అయినా.. తాను యూఎస్ లో ఉన్నందు వల్ల ఆ సినిమాను చూడలేదని.. కానీ.. 2013లో ఆసినిమాను టీవీలో చూశానని.. దీంతో తన కథను కాపీ కొట్టి ఆ సినిమా తీశారని అర్థమయిందని ఆమె తెలిపారు. సినిమాలోని ప్రతి పాత్ర తను రాసిన నవల నుంచి కాపీ కొట్టిందే..

2011 లో వచ్చిన మిస్టర్ పర్ ఫెక్ట్ సినిమా గుర్తుంది కదా. ఆ సినిమా కాపీ అని దానిపై కోర్టులో కేసు నడుస్తోంది కదా. ఆ కేసుపై విచారించిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మిస్టర్ పర్ ఫెక్ట్ సినిమా కథ, నా మనసు నిన్ను కోరే నవల కథ ఒకేవిధంగా ఉన్నాయని తెలిపింది.

2017లో శ్యామల అనే మహిళ.. తన కథను దొంగలించి మిస్టర్ పర్ ఫెక్ట్ సినిమా తీశారని కేసు వేశారు. దీంతో కాపీరైట్ చట్టం కింద నిర్మాత దిల్ రాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. దానిపై విచారణ చేపట్టిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు.. మిస్టర్ పర్ ఫెక్ట్ సినిమా కథ, నా మనసు నిన్ను కోరే కథ దాదాపు ఒకేలా ఉన్నాయని నిర్దారించింది. ఈ కేసు విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను కోర్టు ఆదేశించిందట.

ఈసందర్భంగా రచయిత్రి శ్యామల మాట్లాడుతూ.. మిస్టర్ పర్ ఫెక్ట్ సినిమా రిలీజ్ 2011 లో అయినా.. తాను యూఎస్ లో ఉన్నందు వల్ల ఆ సినిమాను చూడలేదని.. కానీ.. 2013లో ఆసినిమాను టీవీలో చూశానని.. దీంతో తన కథను కాపీ కొట్టి ఆ సినిమా తీశారని అర్థమయిందని ఆమె తెలిపారు. సినిమాలోని ప్రతి పాత్ర తను రాసిన నవల నుంచి కాపీ కొట్టిందేనని స్పష్టం చేశారు. దీనిపై ఆ సినిమా నిర్మాత దిల్ రాజుతో మాట్లాడటానికి ప్రయత్నిస్తే ఆయన అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని తెలిపారు. అంతే కాదు.. ఈ సినిమా కథను 2009లోనే రిజిస్టర్ చేసినట్టు తప్పుడు ఆధారాలు చూపించారని శ్యామలాదేవి వాపోయారు.

నా పర్మిషన్ లేకుండా మిస్టర్ పర్ ఫెక్ట్ కథను దొంగలించి సొమ్ము చేసుకున్నారు. ఈ కథ రాయడానికి నాకు సంవత్సరం పట్టింది. సినిమాలో ఉన్న సీన్లలో 30 సీన్లను అయితే మక్కీకి మక్కీ దించేశారు. అంతే కాదు.. ఆ సినిమా అన్ని భాషల్లో రిలీజ్ అయింది. కాబట్టి.. నాకు జరిగిన నష్టానికి నాకు నష్టపరిహారం చెల్లించాల్సిందే.. అని తెలిపారు శ్యామలాదేవి.

అయితే.. దీనిపై మిస్టర్ పర్ ఫెక్ట్ డైరెక్టర్ దశరథ్ కూడా స్పందించారు. శ్యామలా రాణి నవల 2010 ఆగస్టులో పబ్లిష్ అయింది. కానీ ఈ సినిమా కథను 2009 ఫిబ్రవరిలోనే నేను నవ్వుతో అనే శీర్షికతో సినీ రచయిత సంఘంలో నమోదు చేయించా. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించా. ఆ సినిమా కథ కాపీ అనడంతో అర్థమే లేదు. నిజం లేదు. ఆమె నవల కన్నా నా కథే ముందుగా రిజిస్టర్ అయింది. అంతే కాదు… 2008లోనే ఆ సినిమా కథను ప్రభాస్ కు వినిపించాం. అప్పుడు ప్రభాస్ బిల్లా సినిమా షూటింగ్ నిమిత్తం మలేషియాలో ఉన్నారు. అప్పుడు నేను, దిల్ రాజ్.. ఇద్దరం మలేషియా వెళ్లి ప్రభాస్ కు కథ చెప్పాం. ఆయన వెంటనే ఓకే అనడంతో సినిమా స్టార్ట్ అయింది.. అని ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version