తెలంగాణలో మరో ఇంటర్ విద్యార్థిని సూసైడ్

-

శిరీష.. ఇంటర్ బైపీసీ చదువుతోంది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఫెయిల్ అయింది. ఓ సబ్జెక్ట్ లో శిరీష ఫెయిల్ అయింది. దీంతో మనస్థాపానికి గురైంది శిరీష.

తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి ఇంటర్ పరీక్షల ఫలితాలు వివాదాలు వస్తున్న సంగతి తెలిసిందే. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామన్న మనస్థాపంతో ఇప్పటికే పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటర్ బోర్డులో అవకతవకల వల్ల ఫలితాల్లోనూ గందరగోళం ఏర్పడింది. పాస్ అయిన వాళ్లను ఫెయిల్ చేయడం వల్లే విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆందోళనలు కూడా జరిగాయి.

ఎడమవైపు ఉన్న విద్యార్థిని, కుడివైపు ఉన్నది ప్రతీతాత్మక చిత్రం

అయితే.. తాజాగా ఇంటర్ లో ఫెయిల్ అయ్యానన్న మనస్థాపంతో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కోండ్రోన్ పల్లిలో చోటు చేసుకున్నది. అదే గ్రామానికి చెందిన శిరీష.. ఇంటర్ బైపీసీ చదువుతోంది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఫెయిల్ అయింది. ఓ సబ్జెక్ట్ లో శిరీష ఫెయిల్ అయింది. దీంతో మనస్థాపానికి గురైంది శిరీష. చాలా రోజుల నుంచి మనోవేదనతో ఉన్న శిరీష… ఇవాళ ఉదయం ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని చనిపోయింది.

డాబా మీద నిప్పటించుకున్న శిరీష.. మంటలను తట్టుకోలేక.. డాబా మీది నుంచి దూకింది. దీంతో తీవ్రగాయాలతో శిరీష అక్కడికక్కడే మృతి చెందింది.

ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని.. ఇప్పటి వరకు 18 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు ఆ సంఖ్య 19 కి చేరింది. మరోవైపు ఇంటర్ పరీక్షల్లో నెలకొన్న అవకతవకలపై ప్రభుత్వం స్పందించింది. ఫెయిలైన విద్యార్థులందరికీ మళ్లీ రీవాల్యుయేషన్ చేయిస్తోంది. రీవాల్యుయేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందవద్దని.. ఎటువంటి అఘాయిత్యాలు చేసుకోవద్దని ప్రభుత్వం చెబుతున్నా… విద్యార్థుల ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version