జగన్‌పై దాడి కేసు నిందితుడు శ్రీనివాసరావు మరో ట్విస్ట్
కనిగిరి మహిళలకు దాడిపై ముందే సమాచారం
ఒక ఫోన్ సంబాషణలో.. జగన్‌పై దాడి చేస్తా టీవీలో చూడండి అని ప్రకాశం జిల్లా కనిగిరి దేవాంగనగర్ చెందిన ఓ మహిళకు శ్రీనివాసరావు చెప్పినట్లు ఆమె కుటుంబసభ్యులు చెబుతున్నారు. సదరు మహిళ శ్రీనివాసరావుకు మిస్డ్ కాల్ ద్వారా ఫోన్‌లో పరిచయమైంది. ఆ పరిచయంతో కొన్నాళ్లు ఇద్దరు ఫోన్ ద్వారా మాట్లాడుకుంటున్నట్లు సమాచారం. ఆమెతోనే కాకుండా ఆమె తోడికోడలితో కూడా శ్రీనివాసరావు మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే నిన్ను ఎలా చూడాలని ఆమె శ్రీనివాసరావును ప్రశ్నించగా… ‘కాసేపట్లో జగన్‌పై దాడి చేస్తా.. టీవీలో చూడు’ అని శ్రీనివాసరావు చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఆ ఇద్దరు మహిళలకు ఎక్కువ కాల్స్!
దాడి కేసులో ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన ఇరువురు మహిళలను సిట్ అధికారులు మంగవారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. శ్రీనివాసరావు కాల్ డేటాలో గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన నాగూర్‌వలి పేరుతో ఉన్న సెల్ నంబరుకు అత్యధిక ఫోన్‌కాల్స్ ఉండడంతో సిట్ అధికారులు అతడిని ప్రశ్నించారు. కనిగిరి సమీపంలోని దేవాంగనగర్‌లో ఉండే తన సోదరి ఆ నంబరు వినియోగిస్తున్నట్లు నాగూర్‌వలీ చెప్పినట్లు సమాచారం. దీంతో వారు మంగళవారం దేవాంగనగర్ వచ్చి నాగూర్‌వలి సోదరితోపాటు ఆమె తోడికోడలిని పిడుగురాళ్ల తీసుకెళ్లి విచారిస్తున్నట్లు తెలిసింది.